కామరాజ్ హయాంలో విద్యకే స్వర్ణ యుగమని చెబుతారు. అయితే పరిశ్రమల అభివృద్ధికి కూడా పెద్ద పీటే వేశారు. అందుకే అప్పట్లో జాతీయ స్థాయిలో పరిశ్రమల అభివృద్ధిలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కామరాజ్ హయాంలో ప్రారంభించిన ముఖ్యమైన కొన్ని పరిశ్రమలు.

భారీ పరిశ్రమలు

1 . నైవేలి లిగ్నైట్ గని
2 . పెరంబూర్ కోచ్ ఫాక్టరీ
3 . తిరుచ్చి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్
4 . ఊటీ ఫిలిం పరిశ్రమ
5 . ఆవడి ట్యాంక్ ఫాక్టరీ
6 . కల్పాక్కం అణు విద్యుత్ కేంద్రం
7 . గిండి టెలీ ప్రింటర్ పరిశ్రమ
8 . సంగగిరి దుర్గం ఇండియా సిమెంట్స్
9 . మేట్టూర్ కాగిత పరిశ్రమ
10 . తుపాకీ పరిశ్రమ
11 . గిండి శస్త్ర చికిత్స పరికరాల పరిశ్రమ
12 . అరక్కోణం స్టీల్స్ పరిశ్రమ

వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు

1 . చక్కెర పరిశ్రమలు                           -  11
2 . తిరుచ్చిలోని స్పిరిట్ ఉత్త్పత్తి పరిశ్రమ

ఇతర పరిశ్రమలు 

1 . టెక్స్ట్ టైల్స్ పరిశ్రమలు                      - 159 
2 . సైకిల్ పరిశ్రమలు                              - 04 
3 . ఎరువుల పరిశ్రమలు                         - 06 
4 . సోడా ఉత్త్పత్తి పరిశ్రమలు                    - 02 
5 . తోళ్ళ శుద్ధీకరణ పరిశ్రమలు                - 21 
6 . రబ్బరు పరిశ్రమ
7 . అల్యూమినియం ఉత్త్పత్తి పరిశ్రమ

పారిశ్రామిక వాడలు

గిండి, విరుదునగరు, అంబత్తూరు, రాణీపేట, ఈరోడ్, కాట్పాడి, తంజావూరు, తిరుచ్చి తదితర 19  పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. అలాగే చెన్నై, నైవేలి, తూత్తుకుడి, సేలం, కోయంబత్తూరు, పొల్లాచ్చి, తిరుచ్చిలో 
పరిశ్రమల కమిటీలు ఏర్పాటు చేశారు.