1920 వ ఏడాది ఎన్నికలు

చెన్నై మాగాణ తొలి ఎన్నికలు


1919 వ ఏడాది మాన్టేంగు చెమ్స్ ఫోర్డ్ చట్ట సంస్కరణలు కారణంగా ద్వంద పరిపాలన విధానం అటు కేంద్రంలోనూ, ఇటు మాగాణాల్లోనూ అమలుకు వచ్చింది. ఈ పరిపాల విధానంలో నిర్వహణ శాఖలు రెండుగా విభజించారు. ఆ మేరకు బ్రిటీష్ గవర్నరు నిర్వహణ కమిటీ ప్రత్యేక నియంత్రణలో చట్టం, న్యాయం, హొం శాఖ తదితర ముఖ్యమైన శాఖలు, విద్యా, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం, వృత్తి వంటివి ప్రజలతో ఎన్నుకొన్న శాసన సభ నియంత్రణలోను ఉంటాయి. అప్పటి వరకు గవర్నరుక్కు ప్రతిపాదనలు మాత్రమే చేసిన శాసన సభ అధికారాలు విస్తరించి చట్టాలు రూపొందించే అధికారము కల్పించింది. అయితే దీని వల్ల భారతీయులకు లభించే హక్కులు సంతృప్తిగా లేవని 1920 వ ఏడాది నవంబరులో చెన్నై మాగాణానికి జరిగిన తొలి శాసన సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.  బ్రాహ్మణ యేతరలకు అధికార పదవుల్లో నియామకాలు కోరుతున్న జస్టీస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటి చేసింది. అయితే బలమైన ప్రత్యర్ధి లేకపోవటంతో ఆ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. 1919 వ ఏడాది భారత రాజ్యాంగం ప్రకారం చెన్నై మాగాణం శాసన సభలో కౌన్సిల్ అని పిలువబడే ఒకే సభ ఉండేది. ఈ సభలో 127 సభ్యులు ఉండగా వారిని 61 నియోజకవర్గాల నుంచి ప్రజలు ఎన్నుకున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించిన సభ్యులను కూడా ఎన్నుకున్నారు.నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు, బ్రాహ్మణ యేతర హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, ఐరోపియన్లు, ఆంగ్లో ఇండియన్లు, జమిందారులు, వాణిజ్య కమిటీలు తదితరులకు తరగతుల వారీగా రిజర్వేషన్ ఉంది. మిగతా 29 గవర్నరు నియమించగా వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అయిదుగురు దళితులు. ఈ ఎన్నికల్లో వయోజనులు అందరికీ ఓటు హక్కు లేదు. ఆస్తి విలువ, ఆస్తి పన్ను చెల్లింపు ప్రాతిపదికన ఓటు హక్కు అందించారు.

ఓటర్లు, పోలింగ్

మాగాణంలో నాలుగు కోట్ల జనాభా ఉండగా ఓటు హక్కు మాత్రం 12 , 48 , 156 మంది ఉండగా వారిలో 03 , 558 మంది మాత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాగాణం వ్యాప్తంగా 24 .9 శాతం ఓట్లు నమోదు కాగా అన్ని నియోజక వర్గాల్లో 12 శాతం వరకు ఓట్లు నమోదైయ్యాయి.  చెన్నైలో మాత్రం అత్యధికంగా 52 శాతం ఓట్లు నమోదైయ్యాయి. ఆ ఎన్నికల్లో జస్టీస్ పార్టీ సభ్యులు 63 మంది, రాజకీయ స్వతంత్రులు 18 మంది, ప్రభుత్వ వ్యతిరేకులు 17 మందిగా 98 మంది ఎన్నికైయ్యారు. గవర్నరు ప్రభుత్వ యేతర ఉద్యోగులు 18 మందిని, ప్రభుత్వ ఉద్యోగులు 11 మందిని నియమించారు. నియామక ప్రభుత్వ యేతర ఉద్యోగులు 18 మంది జస్టీస్ పార్టీకి మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం 81 చేరింది.

ప్రభుత్వం ఏర్పాటు

జస్టీస్ పార్టీ అత్యధిక ప్రాంతాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు త్యాగరాజ చెట్టియార్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నరు విల్లింగ్టన్ ప్రభువు ఆహ్వానించారు. అయితే తనకు బదులుగా ఎ.సుబ్బరాయులు రెడ్డియార్ ని ఆహ్వానించాలని ఆయన కోరటంతో ఎ.సుబ్బరాయులు రెడ్డియార్ చెన్నై మాగాణం తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే విద్య, ప్రజాపనుల శాఖ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలు కూడా నిర్వహించారు. పానగల్ రాజ రామరాయనిం కు ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన శాఖలు, కూర్మ వెంకట రెడ్డి నాయుడుకు అభివృద్ధి శాఖలు కేటాయించారు. కొత్త మంత్రి వర్గం 1920 డిసెంబరు 20 వ తేది పదవి ప్రమాణం చేసింది. పెరుకోవలూర్ రాజగోపాలాచారి సభాపతిగా నియమితులైయ్యారు. ఎడ్విన్ పెరియ నాయగం, ఆర్కాడు రామసామి ముదలియార్, పి.సుబ్బరాయన్ కౌన్సిల్ కార్యదర్శులుగా నియమితులైయ్యారు. లయనల్ డేవిడ్సన్ (హొం శాఖ), చార్లెస్ తోడ్ హంటర్ (ఆర్ధిక), మహ్మద్ అబీబుల్లా (రెవెన్యూ), శ్రీనివాస అయ్యంగార్ (చట్టం) గవర్నర్ నిర్వాహక కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఎ.సుబ్బురాయులు రెడ్డియార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యడంతో 1921 జులై 11 వ తేది పనగల్ రాజ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అప్పటి వరకు పనగల్ రాజ నిర్వహించిన విద్య శాఖని ఒస్సాకు చెందిన న్యాయవాది ఎ.పి.పాట్రో కు అందించారు. ఈ శాసన సభ పదవి కాలం 1923 సెప్టెంబరు 11 వ తేది వరకు కొనసాగింది. 

పరిపాలన

తరగతుల వారీగా ప్రాతినిధ్యం కోసం 1921 సెప్టెంబరు 11 వ తేది ప్రభుత్వ ఆదేశం (communal GO # 613) జారీ చేసింది. ప్రస్తుతం భారత దేశంలో అనుసరిస్తున్న రిజర్వేషన్ సిద్ధాంతానికి ఇదే ఆదర్శం. పనగల్ రాజా ప్రభుత్వం హిందూ ఆలయాల నిర్వహణ నిమిత్తం హిందూ దేవాదాయ చట్టాన్ని రూపొందించి దేవాదాయ శాఖని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 1922 డిసెంబరు 18 వ తేది బిల్లు ప్రవేశపెట్టి 1925 వ సంవత్సరం దానిని నెరవేర్చారు. మహిళలు శాసన సభ్యులుగా ఉండటానికి బ్రిటీషు ప్రభుత్వం విధించిన నిషేధ చట్టాన్ని 1921 ఏప్రిల్ 1  వ తేది రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం నెరవేర్చింది. దీంతో 1926 వ ఏడాది డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి చెన్నై తొలి మహిళా శాసన సభ్యురాలు అయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌష్టికాహార పథకం తరహాలోనే 1920 వ ఏడాది ఉదయ భోజన పతాకాన్ని జస్టీస్ పార్టీ ప్రవేశపెట్టింది. దీనిని చెన్నై థౌజండ్ లైట్ లోని  ఓ కార్పోరేషన్ పాటశాలలో ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి