కామరాజర్ చెప్పారు... ఎమ్జీఆర్ చేశారు

ఇది 1967 వ ఏడాది జరిగిన ఆసక్తి కరమైన విషయం. అప్పట్లో కాంగ్రెస్ కు చెందిన కామరాజర్ తమిళనాట బలమైన నేతగా ఉన్నారు. 1967 వ ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గమైన విరుదునగర్ నుంచి పోటి చేశారు. ప్రత్యర్థిగా డీఎంకేకు చెందిన 28 ఏళ్ల వయస్సు కలిగిన పి.శ్రీనివాసన్ అనే వ్యక్తిని ఆ ఎన్నికల బరిలోకి దించారు. అప్పటికే అయిదు  సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచినా కామరాజర్ కు ఇది గట్టి పోటీ అని అనిపించలేదు. అందుకే ప్రచార సమయంలో  తను పడుకొనే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో మాత్రం కామరాజర్ అనూహ్యంగా ఓటమి చవిచూశారు. అయితే అదే ఎన్నికల్లో కామరాజర్ చెప్పినట్టుగానే ఎమ్జీఆర్ పడుకొనే గెలిచారు. ఆ ఎన్నికల్లో పిరంగిమలై (సెయింట్ థామస్ మౌంట్) నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా ఎమ్జీఆర్ పోటి చేశారు. ఎన్నికలకు ముందు సినీ నటుడు, నటి రాధ తండ్రి అయిన రాధ తండ్రి తుపాకితో ఎమ్జీఆర్-ని కాల్చడంతో ఓ తూటా ఆయన గొంతు భాగంలోకి దూసుకు వెళ్ళింది. దీంతో ఆసుపత్రిపాలైన ఆయన ప్రచారానికి కూడా వెళ్ళలేకపోయాడు. తను ఆసుపత్రిలో పడుకొని ఉన్న ఫోటోలను మాత్రం ప్రచారాలకు ఉపయోగించారు. తీంతో ఆ ఎన్నికల్లో పడుకొనే ఎమ్జీఆర్ గెలిచారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి