జస్టీస్ పార్టీ

తమిళనాడు రాజకీయాలు గురించి తెలుసుకోవాలంటే ముందుగా జస్టీస్ పార్టీ (తమిళంలో నీది కట్చి) గురించి తెలుసుకోవాలి. బ్రాహ్మణ యేతరుల సంక్షేమం కోసం 1917 వ ఏడాది దక్షిణ భారత సంక్షేమ హక్కుల సంఘం (సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్) ఏర్పడింది. దీనిని సర్ పి.త్యాగరాయ చెట్టియార్, టి.ఎం.నాయర్ తదితరులు చెన్నై మాగాణంలో (ఇప్పటి తమిళనాడు, తెలంగాణా యేతర ఆంధ్రప్రదేశ్, కేరళలోని మలబార్ జిల్లా, కర్ణాటకలోని దక్షిణ జిల్లాలు కలిపిన ప్రాంతాలను అప్పట్లో చెన్నై మాగాణంగా పిలిచారు) జరిగిన బ్రాహ్మణ యేతరుల సదస్సులో సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేశారు.ఈ సంఘం నుంచే జస్టిస్ పార్టీ ఏర్పడింది. అధికార పదవుల్లో బ్రాహ్మణా ఎతరులను కూడా నియమించాలని అప్పట్లో ఈ సంఘం బ్రిటిషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉండేది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి